హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హైకోర్టు విచారిస్తున్న కేసుల్లో ప్రభుత్వం పార్టీగా లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు శుద్ధ తప్పని సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షి హెడ్ లైన్ షోలో మాట్లాడుతూ ఈ కేసులో తొలి ప్రతివాది ప్రభుత్వమేనన్నారు. హైకోర్టు ఈ కేసు దర్యాప్తుకు ఆదేశించకముందే ప్రభుత్వం నుంచి వివరణ కోరిందని సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు.
సర్కార్ నిర్ణయాలే ఆ జీవోలని ప్రభుత్వం అప్పుడే చెప్పి ఉంటే అసలు దర్యాప్తే ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మంత్రులకు న్యాయ సహాయం అందిస్తున్న నేపథ్యంలో జారీ చేసిన 26జీవోలు సక్రమేనని రుజువు చేసినట్లు అన్నారు. 26 జీవోలు సక్రమమే అయితే అసలు జగన్ పై కేసే లేదని సుధాకర్ రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment